నటీనటులు: రవితేజ, మెహ్రీన్, వివన్ భతేనా, రాజేంద్రప్రసాద్, రాధిక, ప్రకాష్ రాజ్ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: మోహన్ కృష్ణ
ఎడిటింగ్: తమ్మి రాజు
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: అనీల్ రావిపూడి
దర్శకుడు అనీల్ రావిపూడి ‘పటాస్’,’సుప్రీమ్’ వంటి కమర్షియల్ సినిమాలతో ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేశాడు. ఈసారి తన కమర్షియల్ కథకు రవితేజ లాంటి ఎనర్జిటిక్ హీరోను ఎంపిక చేశాడు. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రాజా ది గ్రేట్’ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
దేవరాజ్(వివన్ భతేనా) ఓ పెద్ద రౌడీ.. తన రౌడీయిజంతో రాజకీయాల్లో కూడా రాణించాలని అనుకుంటాడు. దేవరాజ్ కు తమ్ముడు అంటే ప్రాణం. అయితే ప్రకాష్(ప్రకాష్ రాజ్) ఓ కేసు కారణంగా దేవరాజ్ తమ్ముడిని చంపేస్తాడు. దీంతో పగ పెంచుకున్న దేవరాజ్ ప్రకాష్ ను చంపేసి, అతడి కూతును లక్కీను కూడా చంపాలనుకుంటాడు. కానీ లక్కీ మాత్రం అతడి నుండి తప్పించుకుంటుంది. ఇది ఇలా ఉండగా, రాజా(రవితేజ) పుట్టుకతోనే అంధుడు. తన తల్లి అనంతలక్ష్మి(రాధిక) కొడుకుని ఎలా అయినా పోలీస్ ఆఫీసర్ చేయాలనుకుంటుంది. చిన్నప్పటి నుండే అతడికి ట్రైనింగ్ ఇస్తుంది. తల్లి సహకారంతో లక్కీను కాపాడే పోలీస్ మిషన్ లో జాయిన్ అవుతాడు రాజా. మరి గుడ్డివాడైన రాజా.. లక్కీను ఎలా కాపాడగలిగాడు..? దేవరాజ్ ను రాజా ఎలా ఎదిరిస్తాడు..? అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే!
అనాలసిస్:
దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన మొదటి రెండు చిత్రాలు కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో ఈసారి కూడా పక్కా కమర్షియల్ ఎంటర్టైనింగ్ కథను సిద్ధం చేసుకున్నాడు ఈ దర్శకుడు. అయితే ఈ సారి కథను పక్కన పెట్టి కేవలం కామెడీ మీద దృష్టి కేంద్రీకరించడంతో అనుకున్న ఫలితాన్ని సినిమా అందుకోలేకపోయింది. కేవలం రవితేజ ఒక్కడే తన నటనతో సినిమా వెయిట్ ను పెంచే ప్రయత్నం చేశాడు. కథ రొటీన్ అయినా.. సినిమా మొత్తం కూడా ఎంటర్టైనింగ్ గా ఉండడంతో పెద్దగా నిరుత్సాహం కలగదు. అయితే సినిమా మొదలైన కొద్దిసేపటికే కథ ప్రేక్షకుల ఊహకు తెలిసిపోతుంది. దీంతో ఎంటర్టైన్మెంట్స్ తప్ప సినిమాలో పెద్దగా ఎగ్జైట్ అయ్యే అంశాలు కనిపించవు.
సినిమా ప్రధామార్ధం బాగానే ఉన్నప్పటికీ.. సెకండ్ హాఫ్ మొత్తం సాగదీసినట్లుగా అనిపిస్తుంది. లాజిక్ లేని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. స్ట్రక్చర్డ్ స్క్రీన్ ప్లే ఎక్కడా కనిపించదు. పతాక సన్నివేశాల్లో వచ్చే పాత్ర బాగా ఇబ్బంది పెడుతుంది.
రవితేజ అంధుడి పాత్రలో బాగా నటించాడు. ఏ సన్నివేశంలో కూడా తేడా రాకుండా.. నిజంగానే చూపులేదనే భావన కలిగించాడు. తన మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్ తో స్క్రీన్ మీద నవ్వులు పూయించాడు. మెహ్రీన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. తెరపై అందంగా కూడా కనిపించింది. శ్రీనివాస్ రెడ్డి కామెడీ నవ్విస్తుంది. రాధిక పాత్ర సెకండ్ హాఫ్ లో హైలైట్ అయింది. ప్రకాష్ రాజ్, సంపత్ తమ పాత్రల పరిధుల్లో బాగా నటించారు.
సాయి కార్తీక్ బ్యాక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగునప్పటికీ పాటలు మాత్రం పెద్దగా ఆకట్టుకోవు. మోహన్ కృష్ణ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఎడిటింగ్ కారణంగా సెకండ్ హాఫ్ చికాకు తెప్పిస్తుంది. కొన్ని అనవసరపు సన్నివేశాలను ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి. మొత్తానికి కథ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో అటు మాస్ ప్రేక్షకులను, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి.
రేటింగ్: 2.75/5