దిల్ రాజు ఏ సినిమానయినా షూటింగ్ పూర్తయిన తరువాత ఫైన్ ట్యూన్ చేసి సెన్సార్ అయినా తరువాత రిలీజ్ డేట్ ఇస్తాడు. అందుకే దిల్ రాజు సినిమా రిలీజ్ అవుతుంది అంటే యూనిట్ లో ఎవ్వరికి కూడా టెన్షన్ ఉండదు. అయితే రవితేజ హీరో గా నటిస్తున్న రాజ్ ది గ్రేట్ విషయంలో మాత్రం దిల్ రాజు లెక్క తప్పుతుందేమో అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది.చాలా సీన్స్ కి ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి. హీరోయిన్ మెహ్రీన్ కూడా ఆ షూటింగ్ లో బిజీ గా ఉందట. సో,ఇదంతా చూస్తుంటే రాజా ది గ్రేట్ ముందు అనుకున్నట్టు అక్టోబర్ 18 గాని లేదా అక్టోబర్ 19 న గాని రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడంలేదు. ఎందుకంటే అంత హడావిడిగా సినిమా చేసినా దిల్ రాజు కరెక్షన్స్ చెయ్యకుండా బయటికి రావడం కుదరదు.
పైగా సెన్సార్ లో కూడా స్లాట్ దొరకాలి. ఈ కన్ఫ్యూషన్ ఉంటే సినిమా పబ్లిసిటీ విషయంలో వీక్ అయిపోతారు. అలా అరకొరగా ఆడియన్స్ ముందుకు వస్తే సినిమా రిజల్ట్ కూడా మారిపోవచ్చు. నిజానికి రాజ్ ది గ్రేట్ ట్రైలర్ తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. అనిల్ రావిపూడి మార్క్ కి,రవి తేజ టైమింగ్ కి పర్ఫెక్ట్ గా సింక్ కుదిరింది. సో,సినిమాలో ఎంటర్టైన్మెంట్ కూడా అదిరిపోతుంది టాక్. ఇంత పాజిటివ్ టాక్ ఉన్న ఈ సినిమా రిజల్ట్ అనుకూలంగా రావాలంటే సినిమా రిలీజ్ కూడా కూల్ గా ఉండాలి. వరుస విజయాలతో దూసుకుపోతున్న దిల్ రాజు ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతాడో చూడాలి.