HomeTelugu Big StoriesRaja Saab విషయంలో ఈ పుకార్లలో నిజం లేదా?

Raja Saab విషయంలో ఈ పుకార్లలో నిజం లేదా?

Raja Saab teaser update: Here’s what movie team has to say!
Raja Saab teaser update: Here’s what movie team has to say!

Raja Saab update:

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD సినిమాతో మరో భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. మైతాలజికల్ సైఫై ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఈ ఏడాది భారతీయ సినిమాల్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది.

ప్రస్తుతం ప్రభాస్ Raja Saab అనే రొమాంటిక్ హారర్ కామెడీ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మారుతి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్లు వినిపిస్తున్నాయి. కొన్ని పుకార్ల ప్రకారం, రాజా సాబ్ సినిమా ఆడియో హక్కులు తక్కువ ధరకే అమ్ముడయ్యాయని చెప్పుకుంటున్నారు.

తాజాగా చిత్ర యూనిట్ ఈ వార్తలను పూర్తిగా ఖండించింది. ఈ రూమర్లలో ఎలాంటి నిజం లేదని, ఎవరూ ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని వారు స్పష్టం చేశారు.

ఇక తాజాగా మరో రూమర్ వెలుగులోకి వచ్చింది, అదేంటి అంటే… ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న రాజా సాబ్ టీజర్ విడుదల కానుందనే వార్త. అయితే ఈ రూమర్ కూడా అసత్యమని, టీజర్ త్వరలో విడుదల చేసే ప్లాన్ లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. సినిమా ఏప్రిల్ 2025లో థియేటర్లలో విడుదల కానుంది. ఇక ప్రమోషనల్ కంటెంట్ విడుదల కోసం ప్రేక్షకులు కొంత సమయం వేచి చూడాల్సి ఉంది.

ఈ క్రమంలోనే తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల రూమర్లు ఊపందుకున్నాయి. అభిమానులు కూడా ఈ పుకార్లను నమ్మకూడదని.. ఏదైనా అధికారిక సమాచారం నేరుగా ప్రొడక్షన్ హౌస్ నుండి మాత్రమే వస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. మాళవిక మోహనన్ మరియు నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Read More: Fauji సినిమా గురించి ఈ అప్డేట్స్ విన్నారా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu