HomeTelugu Big StoriesRaja Saab సినిమా బడ్జెట్.. అంతకు మించి

Raja Saab సినిమా బడ్జెట్.. అంతకు మించి

Raja Saab: Crazy details of the Prabhas starrer
Raja Saab: Crazy details of the Prabhas starrer

Raja Saab Budget:

ప్రభాస్ చేతిలో బోలెడు ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా Raja Saab సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మారుతీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా చిత్రా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

నిన్న మొన్నటిదాకా సినిమా చిన్న బడ్జెట్ సినిమా అని అందరూ అనుకున్నారు. కానీ సినిమా కోసం భారీ బడ్జెట్ వెచ్చిస్తున్నట్లు ఈ మధ్యనే చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఎంత భారీ బడ్జెట్ అనేది తెలియలేదు. తాజాగా ఈ విషయం మీదే నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

“సినిమా కోసం ఒక భారీ సెట్ ను నిర్మించాం. ఇప్పటిదాకా ఇండియాలో ఇండోర్ లో ఇంత భారీ సెట్ ఎవరూ నిర్మించలేదు. 40 వేల చదరపు అడుగుల భారీ సెట్ ఇది. ఇంత సైజ్ ఫ్లోర్ మీద ఇండియాలో ఎవరూ సెట్ వేయలేదు. ప్రభాస్ సినిమా కోసమే ఈ సెట్ నిర్మించాం. ఇలాంటివి ఇంకా చాలా సెట్లు నిర్మించాము కానీ.. షూటింగ్లోని ముఖ్య భాగం ఇక్కడే జరుగుతుంది. కచ్చితంగా ఈ సెట్ సినిమాలు హైలైట్ పాయింట్ గా ఉంటుంది” అని అన్నారు విశ్వప్రసాద్.

అంతేకాకుండా ఇది చిన్న బడ్జెట్ సినిమా కాదు అని.. ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టుగానే ప్యాన్ ఇండియా బడ్జెట్ ఉంటుంది అని అన్నారు నిర్మాత. షూటింగ్ గురించి మాట్లాడుతూ ఇప్పటికే 50% షూటింగ్ పూర్తయింది అని స్పష్టం చేశారు. అంతేకాకుండా అక్టోబర్ నాటికి సినిమా టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తవుతుందట.

ఇంకా అప్పటినుంచి కేవలం పాటల షూటింగ్ మాత్రమే పెండింగ్లో ఉంటుంది. అది కూడా పూర్తి చేసి త్వరగా నిర్మాణాంతర పనులు కూడా పూర్తిచేసి రాజా సాబ్ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu