HomeTelugu Trendingరాజమౌళి తర్వాత సినిమా ఆ హీరోతోనే..!

రాజమౌళి తర్వాత సినిమా ఆ హీరోతోనే..!

1 12రాజమౌళి RRR సినిమా షూటింగ్ వేగంగా జరుపుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ ఇప్పటి వరకు దాదాపు 40శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఇదిలా ఉంటె, రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. రాజమౌళి నెక్స్ట్ సినిమాను కన్ఫర్మ్ చేశారని, ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఆ హీరో సినిమా చేసేందుకు కుదరడం లేదని, నెక్స్ట్ సినిమా ఆ హీరోతోనే సినిమా చేయబోతున్నారని సమాచారం. ఆ హీరో ఎవరో కాదు.. మహేష్ బాబు. మహేష్ తో సినిమా చేయాలని 8 సంవత్సరాల క్రితమే అనుకున్నా కుదరలేదట. ఇప్పటి వరకు రాజమౌళి బిజీగా ఉండటంతో మహేష్ బాబుతో సినిమా చేయలేకపోయారు. కాగా, నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో చేస్తున్నారని టాక్ తెలుస్తోంది. దసరా సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా ప్రకటన వస్తుందని అనుకున్నారు. కానీ, ఎలాంటి న్యూస్ బయటకు రాకపోవడం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu