HomeTelugu Trendingప్రమాదంపై స్పందించిన రాజ్‌తరుణ్‌

ప్రమాదంపై స్పందించిన రాజ్‌తరుణ్‌

1 20టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ కారు సీటు బెల్టు తన ప్రాణాల్ని కాపాడిందని తెలిపారు. ఆయన సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. షూటింగ్‌ పూర్తి చేసుకుని ఓ నిర్మాత కారులో ఇంటికి బయలుదేరిన ఆయన.. రంగారెడ్డి జిల్లా అల్కాపూర్‌ టౌన్‌షిప్‌ వద్ద అదుపుతప్పి గోడను ఢీకొన్నారు. అనంతరం ఘటనా స్థలం నుంచి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటికి వచ్చింది.

రాజ్‌ తరుణ్‌ ఆరోగ్యంపై అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన తర్వాత ఆయన మొదటి ట్వీట్‌ చేశారు. సీటు బెల్టు తనను కాపాడిందని ఓ పోస్ట్‌ చేశారు. ప్రమాదం జరిగిన తీరును వివరించారు. ‘నాపై చూపిన అభిమానానికి అందరికీ ధన్యవాదాలు. నేను క్షేమంగా ఉన్నానా, లేదా? అని తెలుసుకోవడానికి చాలా మంది ఫోన్లు చేశారు. నర్సింగ్‌ సర్కిల్‌ నుంచి ఇంటికి చేరుకున్నా’.

‘గత మూడు నెలల్లో అల్కాపూర్‌ టౌన్‌షిప్‌ వద్ద చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఒక్కసారిగా కుడివైపుకు తిరగాల్సి వచ్చింది. కుడివైపు స్టీరింగ్‌ తిప్పాలని నిర్ణయించుకునేలోపు.. అదుపు తప్పింది. దీంతో కారు రోడ్డు పక్కనున్న గోడను ఢీకొంది. భయంతో ఆ క్షణం నాకు ఏం చేయాలో అర్థంకాలేదు. సీటు బెల్టు తీసి.. నన్ను నేను చూసుకున్నా. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్లా. జరిగిన అసలు విషయం ఇది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. మరికొన్ని రోజుల్లో షూటింగ్‌లో పాల్గొంటాను. మీ ప్రేమకు మరోసారి థాంక్స్‌’ అని ఆయన పోస్ట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu