HomeTelugu Trendingరాజ్‌ తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ట్రైలర్‌

రాజ్‌ తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ ట్రైలర్‌

13 1
యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా..’. మాళవిక నాయర్‌, హెబ్బా పటేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటూనే మరోవైపు ప్రమోషన్లను మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, ప్రి టీజర్‌, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది. యూత్‌ను టార్గెట్‌ చేస్తూ రూపొందించిన ఈ టీజర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కానుంది. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందిచాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu