Raj Tarun Lover Controversy: షార్ట్ ఫిల్మ్స్ తో పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ కెరియర్ మొదట్లో ఇక సినిమాల పరంగా చూస్తే ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామా, కుమారి 21 ఎఫ్ వంటి సినిమాలతో బాగానే హిట్స్ అందుకున్నాడు కానీ ఈమధ్య కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా లేదు. వరుసగా ఫ్లాప్ లు మాత్రమే రావడంతో కొంత బ్రేక్ కూడా తీసుకుని నాగార్జున నా సామి రంగా లో చిన్న పాత్రతో మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చాడు.
ఇప్పుడు రాజ్ తరుణ్ తిరగబడరా సామి అనే సినిమాలో నటిస్తున్నారు. అదే ఇప్పుడు రాజ్ తరుణ్ కెరియర్ ని ముంచేసేలాగా ఉంది. విడుదల కి ముందే సినిమా ఎందుకు తన కెరియర్ ను పాడు చేస్తుంది అంటే దాని వల్ల క్రియేట్ అయిన వివాదం. ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మాల్వి మల్హోత్రా తో రాజ్ తరుణ్ ప్రేమలో పడ్డాడట. ఆమెతో కలిసి తిరుగుతున్నాడట.
కానీ 11 ఏళ్లుగా ఆమెని ప్రేమించి ఇప్పుడు మోసం చేశాడు అంటూ రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య పోలీసు కేస్ నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే 2012 నుండి లావణ్య, రాజ్ తరుణ్ ప్రేమించుకుంటున్నారు. 2014 నుండి ఒకే ఇంట్లో కలిసి కూడా ఉంటున్నారు. 10 ఏళ్లు బాగానే సాగిన వీళ్ళ ప్రేమాయణం మధ్యలో మాల్వి మల్హోత్రా దూరింది.
Raj Tarun Lover Controversy:
ఇప్పుడు మాల్వి తో క్లోజ్ అయిన రాజ్ తరుణ్ ఆమెతో కలిసి ట్రిప్స్ కి కూడా వెళ్ళాడట. అనుమానం వచ్చి లావణ్య నిలదీయగా రాజ్ తరుణ్ తిరగబడ్డాడట. అతడితో పాటు మాల్వి మల్హోత్రా, ఆమె తండ్రి, రాజ్ తరుణ్ సోదరుడు కూడా ఆమెను టార్చర్ చేయడం మొదలు పెట్టారట. రాజ్ తరుణ్ ని వదిలేయకపోతే ఆమెను చంపేస్తామని బెదిరిస్తున్నారట.
ఇదంతా లావణ్య పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్ లో స్పష్టంగా రాసింది. వాళ్ళ నుండి ఆమెకు ప్రాణ హాని ఉంది అని అందుకే ఆమెకు రక్షణ కల్పించాలి అని నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది.
అసలు కెరియర్ పరంగా పెద్దగా బాగా లేని రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితంలో కూడా పెద్ద చిక్కుల్లో ఇరుక్కున్నాడు. అసలే చిన్న హీరో కాబట్టి ప్రతి చిన్న విషయం కెరియర్ ను ఎఫెక్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఒక ఆడపిల్ల పెట్టిన కేస్ రాజ్ తరుణ్ కెరియర్ కి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేస్తుందా అని చూడాలి.