HomeTelugu Big StoriesRaj Tarun Case: సినిమా ఏమో కానీ కెరియర్ తిరగబడేలా ఉంది

Raj Tarun Case: సినిమా ఏమో కానీ కెరియర్ తిరగబడేలా ఉంది

raj tarun case
Raj Tarun Case puts his career at stake

Raj Tarun Case:

రాజ్ తరుణ్‌ హీరోగా నటించిన ‘తిరగబదరా సామి’ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే విడుదలకి ముందే రాజ్ తరుణ్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. లావణ్య అనే ఒక అమ్మాయి రాజ్ తరుణ్ మాజీ ప్రేయసిని అని చెప్పి అతనిపై హరాస్మెంట్ మరియు నమ్మకద్రోహం ఆరోపణలతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.

ఇప్పుడు ఈ కేసు తాలూకు విచారణ ప్రారంభమయ్యింది. అయితే రోజులు గడిచే కొద్దీ ఈ వివాదం సినిమా పబ్లిసిటీ మీద ప్రభావం చూపాల్సింది పోయి మొత్తం రాజ్ తరుణ్ సినిమా కెరియర్ మీదే ప్రభావం చూపించేలా ఉంది. దీంతో భయపడిన రాజ్ తరుణ్ ‘తిరగబడరా సామి’ విడుదల తేదీని ఆగస్ట్ 12ని మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కేసు సినిమా పై చెడు ప్రభావం చూపుతుందని రాజ్ తరుణ్ ఇలా చేశాడని చెప్పుకోవచ్చు.

లావణ్య ఫిర్యాదు కారణంగా రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం మొత్తం ప్రజల ముందుకి వచ్చేసింది. కొన్ని సార్లు ఇలాంటి వివాదాలు ప్రేక్షకులలో ఆసక్తి పెంచవచ్చు కానీ రాజ్ తరుణ్ విషయంలో కేసు మరీ ముదిరిపోవడంతో బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కువ.

మరోవైపు అసలే చిన్న సినిమా కాబట్టి తిరగబడరా సామీ చిత్ర నిర్మాతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంత విడుదల తేదీ వాయిదా వేసినప్పటికీ విషయం మాత్రం సద్దుమనిగేలాగా కనిపించడం లేదు. ఒకవైపు లావణ్య ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కొత్తకి వెళ్లి మరి న్యాయం చేయమని కోరతానని చెబుతోంది.

 

మరోవైపు లావణ్య తరపు లాయర్ రాజ్ తరుణ్ ఆమెకు కేసు వెనక్కి తీసుకుంటే ఐదు కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడంటూ మరొక బాంబు పేల్చారు. మరి ఈ సమయంలో సినిమా తిరగబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu