HomeTelugu Trendingసర్‌ప్రైజ్‌ అనౌన్స్‌మెంట్‌: అషూ రెడ్డితో ప్రేమలో రాహుల్‌ సిప్లిగంజ్‌

సర్‌ప్రైజ్‌ అనౌన్స్‌మెంట్‌: అషూ రెడ్డితో ప్రేమలో రాహుల్‌ సిప్లిగంజ్‌

Rahul sipligunj surprise an
సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ‘సర్‌ప్రైజ్‌ అనౌన్స్‌మెంట్‌’ అంటూ లవ్‌ సింబల్‌ పెట్టి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. అతడు ప్రేమిస్తున్నది ఎవరినో కాదు బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్‌ అషూ రెడ్డి. అక్కినేని నాగార్జున హోస్ట్‌ చేసిన బిగ్‌బాస్‌ 3 షోలో రాహుల్‌, అషూ కూడా పాల్గొన్నారు. అయితే అదే షోలోని పునర్నవి భూపాలంతో రాహుల్‌ ప్రేమలో పడ్డాడనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ షోలో వీరిద్దరే హైలైట్‌గా నిలిచారు. ఈ షో తరువాత కూడా ఈ ఇద్దరు కలిసి చాలా చోట్ల కనిపించడంతో అది నిజమేనని అనుకున్నారు. కానీ అందరి ఊహలకు భిన్నంగా రాహుల్‌ అషూ రెడ్డితో ప్రేమలో పడ్డానంటున్నాడు. అయితే ఇది ప్రేమా? ప్రమోషనా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అంతకుముందు సొంత ఆల్బమ్స్‌ చేసుకుంటూ యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేసిన రాహుల్‌ సిప్లిగంజ్‌ బిగ్‌బాస్‌ తర్వాత సినిమా పాటలు పాడుతూ ఫుల్‌ బిజీగా మారాడు. ఇటీవల వస్త్ర వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. అయితే అషురెడ్డి, రాహుల్‌ మధ్య బిగ్‌బాస్‌ షోలోనే ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోనున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అందుకే సర్‌ప్రైజ్‌ అనౌన్స్‌మెంట్‌ అంటూ రాహుల్‌ పోస్టు చేశాడని అభిప్రాయపడుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!