తెలుగు ‘బిగ్ బాస్ 3’ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై జరిగిన దాడి సంచలనం సృష్టించింది. పబ్‌లో అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో రాహుల్‌ను బీరు సీసలతో తలపై కొట్టారు కూడా. అందులో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి ఉన్నాడని రాహుల్ చెప్పాడు. వాళ్లు కావాలని తనపై దాడి చేసారని.. పబ్‌లో జరిగిన గొడవలో తన తప్పేం లేదని చెప్పాడు రాహుల్. మీడియా ముందుకు వచ్చి కూడా ఈయన తన గోడు వెల్లబోసుకున్నాడు. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉందని తనపై కావాలనే దురసుగా ప్రవర్తించారని.. అలా అయితే ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించాడు. ఈ గొడవపై ఇప్పుడు ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేసాడు రాహుల్. ఈ సారి ఏకంగా అక్కడ జరిగిన గొడవకు సంబంధించిన సిసిటీవీ ఫుటేజ్ ట్వీట్ చేసాడు.
తనకు న్యాయం కావాలంటూ కేటీఆర్‌ను రిక్వెస్ట్ చేసాడు. కేటీఆర్ గారూ నాకు న్యాయం కావాలి.. నేను టీఆర్ఎస్ పార్టీకే ఓటేసాను.. ఈ పార్టీ కోసమే నిలబడ్డాను.. బతికున్నంత వరకు కూడా ఈ నేల కోసమే పోరాడతాను అంటూ ట్వీట్ చేసాడు. తనకు న్యాయం జరగాలని.. అది మీరే చేయాలని కోరాడు రాహుల్. అయితే ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ కూడా ఇచ్చాడు. కేటీఆర్‌ను డైరెక్టుగా న్యాయం చేయమని కోరడంతో ఇప్పుడు రాహుల్ ఇష్యూ మరింత హిటెక్కింది. పైగా అక్కడున్నది పార్టీకి సంబంధించిన వాళ్లే కావడంతో కేటీఆర్ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
CCTV footage of the incident, how this gang has provoked & attacked me.
please see it for yourself & stand for what is right!@KTRTRS sir, I always stood for TRS party & I vote for TRS alone because I am born on this land & I will serve Telangana as long as I live.#ineedjustice pic.twitter.com/8LQ3PGEBwe— Rahul Sipligunj (@Rahulsipligunj) March 6, 2020