HomeTelugu Newsత్వరలో పెద్ద గుడ్‌ న్యూస్‌.. శివాత్మిక ఫొటో షేర్‌ చేసిన రాహుల్‌

త్వరలో పెద్ద గుడ్‌ న్యూస్‌.. శివాత్మిక ఫొటో షేర్‌ చేసిన రాహుల్‌

13 1
తెలుగు ‘బిగ్ బాస్’ రియాలిటీ షోతో చాలా పాపులర్ అయ్యాడు సింగర్‌ రాహుల్ సిప్లిగంజ్. బిగ్ బాస్ సీజన్‌-3లో విన్నర్‌గా నిలిచిన రాహుల్ తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దగ్గరైయాడు. అది అలా ఉంటే ఓ వైపు సూపర్ స్టార్స్‌కు పాటలు పాడుతూనే రాహుల్ సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తోన్న రంగమార్తండలో రాహుల్‌కి నటించే అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని రాహుల్ ఆ మధ్య తన సోషల్ మీడియాలో ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. దర్శకుడు కృష్ణవంశీ ఈ ‘రంగమార్తాండ’ చిత్రాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మరాఠి సినిమా నటసామ్రాట్‌కు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలో జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ , హాస్యనటుడు బ్రహ్మనందం నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక, రాహుల్‌కు జోడిగా నటిస్తోంది. శివాత్మిక ‘దొరసాని’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తరువాత మంచి కథల కోసం ఎదురు చూస్తున్న ఆమె, కృష్ణవంశీ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం విశేషం. అంతేకాదు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే కొన్ని సన్నివేశాలను ఇటీవలే దర్శకుడు వంశీ చిత్రీకరించినట్టు తెలుస్తున్నాయి. కాగా దీనికి సంబందించి రాహుల్ తన సోషల్ మీడియాలో ఓ పిక్ పోస్ట్ చేశాడు. ఆ పిక్‌లో రాహుల్, శివాత్మిక కలిసి బ్యాక్‌ విత్ శివాత్మిక అని త్వరలో పెద్ద గుడ్ న్యూస్ రాబోతోందని తెలిపాడు రాహుల్‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu