టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్ 3 కి రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రాహుల్ బిగ్ బాస్ ప్రైజ్ మనీ అందుకున్నాడు. బిగ్‌బాస్ విన్నర్‌గా నిలవడంతో రాహుల్ క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో అమాంతం పెరిగిపోయింది. అయితే సాధారణ వ్యక్తిగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాహుల్ ఆ షో ద్వారా పెద్ద మొత్తంలో అందుకున్నాడు. గతంలో తాను చేసిన మ్యూజిక్ కన్సర్ట్స్ , పాడిన పాటలకు చాల తక్కువ సంపాదన వచ్చేదని దీంతో షోలో విజేతగా నిలిస్తే ఓ ఇల్లు కొనుక్కుంటానని అమ్మా నాన్నలను చక్కగా చూసుకుంటానని తెలిపాడు. అయితే ఈ షో తరువాత బంపుర్ ఆఫర్స్ అందుకున్న రాహుల్ అటు సింగర్ గా, ఇటు సినిమాలలో నటిస్తూ తన కెరీర్‌ను ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం రాహుల్ టాప్ హీరోలకు కూడా పాటలు పాడేస్తున్నాడు. ఆ మధ్య కొత్త ఇంట్లోకి కూడా ప్రవేశించిన రాహుల్, ఇప్పుడు తాజాగా బెంజ్‌కు ఓనరయ్యాడు. దానికి సంబందించిన కొన్ని పిక్స్‌ను ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కొత్త కారు కొన్నట్లు తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. దీంతో అభిమానులు వరుసపెట్టి రాహుల్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు.