HomeTelugu Trendingరాజకీయాల్లోకి బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్

రాజకీయాల్లోకి బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్

Rahul Sipligunj
బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి సిప్లిగంజిని పోటీలో నిలపాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుందట.

హైదరాబాద్‌లోని మంగళహాట్‌లో పుట్టిన మాస్ పోరగాడు రాహుల్ సిప్లిగంజ్. మంగళ్ హాట్ గోషామహల్ నియోజకవర్గంలో ఉంది. రాహుల్ సిప్లిగంజిని తమ పార్టీ నుంచి పోటీ చేయిస్తే బలమైన అభ్యర్థిగా నిలుస్తాడని కాంగ్రెస్ భావిస్తున్నట్టుంది. ఈ మధ్య రాహుల్ కూడా గోషామహల్ నియోజకవర్గంలో ఎక్కువగా తిరుగుతున్నాడు.

ఇటీవల జరిగిన బోనాల పండుగ సమయంలో రాహుల్ సిప్లిగంజ్ బాగా సందడి చేశాడు. గోషామహల్ గల్లీల్లో ఫంక్షన్లకు హాజరయినట్టు తెలుస్తోంది. వరుస వివాదాల్లో ఉన్న రాహుల్ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడితో గొడవ తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ విన్నర్‌గా గెలిచాడు.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR సినిమా ద్వారా మరోసారి ప్రపంచవ్యాప్తంగా రాహుల్ ఫేమస్ అయ్యాడు. RRR సినిమాకి ఆస్కార్ రావడంతో ఆ పాట ఆస్కార్ స్టేజి మీద పెర్‌ఫామ్ చేసే అవకాశం రాహుల్‌కు వచ్చింది. అలా రాహుల్ పేరు ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది.

మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజిని గోషామహల్ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాహుల్ సిప్లిగంజిని పోటీ చేయిస్తే బాగుంటుందని పలువురు రాహుల్‌కి చెప్పడంతో తాను కూడా లోకల్‌గా మాట్లాడిన తర్వాత తన నిర్ణయం చెప్పబోతున్నట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!