పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర శిబిరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఎంతో ధైర్యసాహసాలు కనబర్చి మెరుపుదాడులను చేపట్టిన వైమానిక దళ పైలట్లకు సెల్యూట్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా సహా పలువురు రాజకీయ నేతలు దాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
– భారత వైమానిక దళ పైలట్లకు సెల్యూట్: రాహుల్ గాంధీ
– ఈ ఉదయం నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం మెరుపుదాడి చేసి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. ఇది ఆరంభం మాత్రమే: కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
-పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టిన భారత వైమానిక దళ ధీరులకు సెల్యూట్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
– నియంత్రణ రేఖ వెంబడి అద్భుత ఆపరేషన్ చేపట్టిన మన వాయుసేనకు అభినందనలు: మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా
– అమరవీరుల త్యాగాలను వృథాగా పోనివ్వమని పాకిస్థాన్‌కు ఇంతకుముందే చెప్పాం. ఓ భారతీయుడిగా ఈ రోజు నేను గర్వపడుతున్నాను: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్
– భారత వైమానిక దళం, మన సాయుధ బలగాలకు సెల్యూట్ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్