డైరెక్టర్‌లు హీరోలుగా మారడం చాలా సినిమాల్లో చూశాం. అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కనిపిస్తూ ఉంటారు. సంగీత దర్శకులు కూడా సినిమాల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రల్లో మెరుస్తు ఉంటారు. కానీ, నెగెటివ్ రోల్స్ చేయడం ఎప్పుడు చూసి ఉండరు. మొదటిసారి నాగ్ అశ్విన్ సినిమా పలాసలో రఘు కుంచె సంగీతం అందిస్తూనే నెగెటివ్ రోల్ చేశారు.
సంగీతం అందించిన తరువాత తనను సినిమాలో పాత్ర చేయమన్నారని, అయితే, పాత్ర గురించి చెప్పిన తరువాత వెంటనే ఒప్పేసుకొని చేసినట్టుగా రఘు కుంచె తెలిపారు. సినిమాలో నెగెటివ్ టచ్ ఉంచే పాత్ర అని, కొత్తగా ఉంటుందని అన్నారు. జుట్టు పెంచి మేకప్ లేకుండా నటించినట్టు రఘు కుంచె పేర్కొన్నారు. తన పాత్ర అందరికి తప్పకుండా నచ్చుతుందని రఘు కుంచె తెలిపారు.