తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని దర్శకుల సంక్షేమం కోసం ఓ ట్రస్ట్‌ని ఏర్పాటు చేశారు. దీనికి తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ (టీఎఫ్‌డీటీ)గా నామకరణం చేశారు. ఈ సంస్థకు ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు చైర్మన్‌గా, ఎన్.శంకర్ మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తారు. దాసరి నారాయణరావు పుట్టిన రోజైన మే 4న దర్శకుల దినోత్సవం జరుపుకున్నారు. ఆరోజే దర్శకులంతా కలిసి ట్రస్ట్ ఏర్పాటుకు నిర్ణయించారు. అప్పుడే ప్రముఖ దర్శకులంతా విరాళాలు ప్రకటించారు. ఈ ట్రస్ట్ ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేయాలన్నదే ప్రధాన ఉద్దేశం. మెహర్ రమేష్‌ని కోశాధికారిగా ఎంపిక చేశారు. వి.వి.వినాయక్, సుకుమార్, బోయపాటి శ్రీను, సురేందర్‌రెడ్డి, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నందిని రెడ్డి, రాంప్రసాద్, కాశీ విశ్వనాథ్, బీవీఎస్ రవి ట్రస్టీలుగా వ్యవహరిస్తారు