తమిళనాట హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కరుప్పర్ కూట్టమ్ అనే సంస్థ వీడియోలను విడుదల చేసిన ఘటన తమిళనాడులో వివాదంగా మారింది. హిందూ దేవతలపై విషం చిమ్ముతూ.. వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వీడియోలు వైరల్గా మారాయి. ఇప్పటికే అందుకు బాధ్యులైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో సినీ ప్రముఖులు పలువురు కరుప్పర్ కూట్టమ్ వీడియోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయంను తెలియజేస్తున్నారు.
తాజాగా ఈ వివాదంపై లారెన్స్ స్పందిస్తూ… వారి పేర్లను చెప్పడం వల్ల వారికి పబ్లిసిటీ కల్పించాలని కోరుకోవడం లేదు. ఆ సంస్థ తీరు దారుణంగా ఉంది. ఇలాంటి సమయంలో మురుగన్ భక్తులకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. మురుగన్ శక్తి ఏమిటో సమయమే తెలియజేస్తుంది. మురుగన్ తప్పు చేసిన ఏ ఒక్కరిని వదలడు అని అందరికి తగిన శిక్ష విధిస్తాడంటూ అంటూ.. లారన్స్ అన్నాడు.