విలక్షణ నటుడు రజనీకాంత్‌కు.. నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే.. అయితే తన అభిమాన నటుడిపై ఉన్న అభిమానాన్ని చెప్పుకునే సమయంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రజినీకాంత్ నటించిన తాజా మూవీ ‘దర్బార్’ ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న లారెన్స్… తన ప్రసంగంలో చిన్నతనంలో కమల్ హాసన్ పోస్టర్లపై ఆవు పేడ విసిరినట్లు.. చెప్పుకొచ్చాడు… అయితే, ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్ సార్ కలిసి నడుస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పినా.. ఆ పాయింట్‌ను మాత్రమే తీసుకుని కమల్ ఫ్యాన్స్ లారెన్స్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. దీనిపై సోషల్ మీడియాలో లారెన్స్ క్లారిటీ ఇచ్చినా… ఆ వీడియో మొత్తం చూడాలని విజ్ఞప్తి చేసినా ఫ్యాన్స్ నుంచి మాత్రం లారెన్స్‌పై మాటల దాడి జరుగుతూనే ఉంది… ఇక, చివరకు నేరుగా కమల్ హాసన్‌నే కలిసిన లారెన్స్ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
కమల్‌ను కలిసిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు రాఘవ లారెన్స్… ‘దర్బార్’ ఆడియో లాంచ్ సందర్భంగా కమల్ హాసన్ సార్ గురించి నేను చేసిన ప్రకటనలకు సంబంధించినది.. నేను చేసిన ప్రకటనలు తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఇక, ఉద్దేశపూర్వకంగా నన్ను విమర్శించారు. నేను అలా అనలేదు… ఈ వివాదానికి తెర దించడానికి నేను కమల్ హాసన్‌ను వ్యక్తిగతంగా కలిశా… నా వ్యాఖ్యలపై ఆయనకు వివరణ ఇచ్చా.. ఆయన నాకు శుభాకాంక్షలు తెలిపారు అంటూ.. కమల్ హాసన్‌తో కలిసిన దిగిన ఫొటోలను షేర్ చేసిన లారెన్స్.. కమల్ హాసన్ ప్రేమ, ఆయన అవగాహనకు ధన్యవాదాలు… అంటూ ట్వీట్ చేశారు.
Watch the full video of My speech at Darbar audio launchhttps://t.co/PdvI3FZ2YR pic.twitter.com/7eOJH5Zag5
— Raghava Lawrence (@offl_Lawrence) December 7, 2019
— Raghava Lawrence (@offl_Lawrence) December 14, 2019