ప్రముఖ సినీ నటులు రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిపై నటుడు, దర్శకుడు రాఘవాలారెన్స్ సంతాపాన్ని ప్రకటించాడు. రెబల్ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణంరాజు ఆతిథ్యాన్ని లారెన్స్ గుర్తు చేసుకున్నాడు. ‘రెబల్ స్టార్ కృష్ణంరాజు గారిని మిస్సవుతున్నా. ఆయన ప్రతీ ఒక్కరినీ సొంత బిడ్డలా చూసుకుంటారు.. అందరికీ ఆయన ఓ అమ్మలా ఆహారం వడ్డిస్తుంటారు. కృష్ణంరాజు ప్రేమ, కేర్‌ను మిస్ అవుతున్నా. నేను టౌన్‌లో లేకపోవడం వల్ల ఆయనకు వీడ్కోలు పలకలేకపోవడం నా దురదృష్టం. ఆయన వారసత్వం ప్రభాస్ ద్వారా ఎల్లపుడూ కొనసాగుతుంది’ అంటూ ఆయనతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు.
I miss my Rebel star Krishnam Raju Garu. He takes care of everyone like his own child and serves them food like a mother. I miss that love and care. My bad luck, I wouldn’t pay my last respect for him as I’m not in town. His legacy will always live through prabhas. 🙏🏼🙏🏼 pic.twitter.com/Sg16fqIvNI
— Raghava Lawrence (@offl_Lawrence) September 13, 2022