కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, నటుడిగా విజయాలు సాధించిన రాఘవ లారెన్స్. ఈ మల్టీ టాలెంటెడ్ నటుడికి ఓ క్రేజీ ఆఫర్ వచ్చింది. విలక్షణ నటుడు కమల్‌హాసన్ సినిమాలో విలన్‌గా నటించబోతున్నాడట. లారెన్స్‌కు దర్శకుడు కనకరాజ్ ఆఫర్ ఇచ్చాడట. కనకరాజ్, కమల్‌హాసన్ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న విక్రమ్ చిత్రంలో లారెన్స్ నెగెటివ్ రోల్ చేయబోతున్నట్లు కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. గతంలో రజనీ మూవీ ఫంక్షన్‌లో కమల్‌హాసన్‌పై లారెన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని పెద్ద రచ్చ జరిగింది. ఆ తర్వాత కమల్ ఇంటికివెళ్లి క్షమాపణ చెప్పాడు. ఇప్పుడు కమల్ సినిమాలో లారెన్స్ నటిస్తున్నాడంటే కొట్టిపారేస్తున్నారు కొందరు.