తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 2005లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. రజనీకాంత్ కెరియర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. తెలుగులోను ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ సినిమాకి ‘చంద్రముఖి 2’ టైటిల్ తో సీక్వెల్ చేయాలని దర్శకుడు పి.వాసు కొంతకాలంగా ప్రయత్నిస్తూనే వున్నాడు. అయితే రజనీకాంత్ మాత్రం పెద్దగా ఆసక్తిని చూపలేదు.
ఈ నేపథ్యంలో వాసు .. లారెన్స్ హీరోగా ఈ సీక్వెల్ చేయడానికి రంగంలోకి దిగాడు. ఈ విషయాన్ని లారెన్స్ స్వయంగా తెలియజేశాడు. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా తెలిపాడు. హారర్ కామెడీ సినిమాలు చేయడంలో లారెన్స్ కి మంచి అనుభవం వుంది. ‘కాంచన’ .. ‘గంగ’ .. ‘శివలింగ’ చిత్రాలు ఈ విషయాన్ని నిరూపించాయి. లారెన్స్ చేయనున్న ‘చంద్రముఖి 2’ కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
— Raghava Lawrence (@offl_Lawrence) April 9, 2020