Radikaa Sarathkumar: సౌత్ సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ గురించి ప్రత్యేకించి చెప్పానసరం లేదు. సమాజంలో జరిగే స్పందిస్తూ.. నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటారు. ముఖ్యంగా మహిళలపై జరిగే అఘాత్యాలు, అనుచిత సంఘటనలపై ఎప్పుడు తన గళం విప్పితుంటారు. మరోవైపు రాజకీయాల్లోనూ పరోక్షంగా యాక్టివ్‌గా ఉంటున్నారు.
ఇక సినిమాలు, సీరియల్స్ తో పాటు ఓటీటీ ప్రాజెక్టులు కూడా చేసుకుంటూ బిజీగా ఉంది. తాజాగా రాధికా తాజాగా చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఓ సినిమా చూసిన రాధికా శరత్‌కుమార్ ఆ సినిమాపై స్పందిస్తూ.. మీరు ఏదైనా సినిమా చూసి మీరు విసిగిపోయారా? నాకు అయితే ఒక చిత్రాన్ని మధ్యలోనే ఆపేయాలనిపించింది.
చాలా కోపంగా ఉంది అంటూ రాధికా సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. అయితే ఏ సినిమా అనేది మాత్రం రాధికా వెల్లడించలేదు. ఆ సినిమా ఎంటా! అని నెటిజన్లు ఆలోచనలో ఉన్నారు. మరికొందరు మాత్రం యానియల్ అయి ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు.
దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాధికాకు కోపం తెప్పించింది యానిమల్ సినిమానే అంటూ ఎక్స్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై రాధిక స్పందించలేదు. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో వచ్చిన సినిమా యానిమల్.
రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 01న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాలో పలు హింసాత్మక సన్నివేశాలతో పాటు మహిళలను తక్కువ చేసేలా ఉండడంతో ఈ సినిమా పలు వివాదాలకు దారి తీసింది