రాధిక సినిమా అక్కడ వారి కోసమే!
ఇటీవల రాధిక ఆప్టే నటించిన ‘పర్షధ్’ అనే సినిమాకు సంబందించిన వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్
చేసింది. ఈ సినిమా ఒకటుందని తెలియని వారు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూసే పరిస్థితి
కలిగింది. ఈ వీడియోలో రాధిక ఆప్టే అర్ధనగ్నంగా కనిపించడంతో కావాలనే హైప్ క్రియేట్ చేయడానికి
ఈ వీడియో లీక్ చేశారనే వార్తలు వినిపించాయి. లీనా యాదవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అజయ్ దేవగన్, అసీమ్ బజాజ్ లు సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ సినిమాను ఇండియాలో విడుదల చేసే ఆలోచన దర్శక నిర్మాతలకు లేదట. ఇతర దేశాల్లో ఇటువంటి తరహా సన్నివేశాలు ఉండడం సహజం
కనుక అక్కడ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని రూపొందించామనేది దర్శకనిర్మాతల మాట.
నిజానికి ఈ సినిమాను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. అక్కడ నుండే ఈ సీన్స్ ను
లీక్ చేసి ఉంటారని భావిస్తున్నారు.