అటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూనే.. మరో పక్క శృతిమించిన శృంగార పాత్రల్లోనూ నటిస్తూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తోంది రాధికా ఆప్టే. బద్లాపూర్, హంటర్ వంటి సినిమాలు ఆమె నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాయి. తెలుగులో ఆమె చేసిన ‘లెజెండ్’ అలానే
రజినీకాంత్ సరసన నటించిన ‘కబాలి’ సినిమాలు ఆమె క్రేజ్ ను మరింత పెంచాయి.
అయితే ఈ రాధికా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంతో మెప్పించనుంది. తమిళంలో దర్శకుడు మిస్కిన్ సోదరుడు ఆదిత్య డైరెక్ట్ చేస్తోన్న సినిమాలో పూర్తి స్థాయి యాక్షన్ లో రోల్ లో రాధికా ఆప్టే కనిపించనుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటివరకు తెరపై అందాల ఆరబోసిన ఈ బ్యూటీ యాక్షన్ సీన్స్ లో ఎలా నటిస్తుందో.. చూడాలి!