బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధిక ఆప్టే ఆమె భర్త గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా రాధికా ఆప్టే తన పర్సనల్ విషయాలకు దూరంగా ఉంటుంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాధిక ఆప్టే. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర నా చేయడానికి వెనుకాడదు.
తన బోల్డ్‌నెస్ వల్ల ఆమె కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. తెలుగులో బాలకృష్ణతో ”లయన్, లెజెండ్” సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. హిందీలో ప్యాడ్‌మ్యాన్, అంధాదున్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్, ఫొరెన్సిక్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం రాధికా ఆప్టే ‘విక్రమ్ వేదా’ చిత్రంలో నటిస్తోంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘మీరు మీ భర్తతో కలిసి ఎక్కువగా ఫొటోలు దిగరు.. ఎందుకు ?’ అనే ప్రశ్నపై రాధిక ఆప్టే స్పందించింది. కాగా కెరీర్ పరంగా ముంబైలో రాధిక ఆప్టే ఉంటే, ఆమె భర్త బెనెడిక్ట్ టేలర్ విదేశాల్లో ఉంటాడు. ‘నేను ఇక్కడ.. నా భర్త బెన్ (భర్త బెనెడిక్ట్) అక్కడ. మేమిద్దరం ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం. నా పని నేనే చేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాను.
నా వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడం ఇష్టముండదు. నాకు ఫొటోలపై అంతగా ఇష్టంలేదు. ఇక నాకంటే బెన్ ఇంకా వేస్ట్. ఫొటోలు అంటే అస్సలు కోపరేట్ చేయ్యడు. అందుకే మా పెళ్లయి పదేళ్లు కావొస్తున్నా ఇప్పటివరకూ మా పెళ్లి ఫొటోలు కూడా లేవు అన్నారు. మా స్నేహితుల్లో సగం మంది ఫొటోగ్రాఫర్లే. అయినా మాకు ఫొటోలు దిగేంత ఆసక్తి కలగలేదు’ అని చెప్పుకొచ్చింది.