క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన తారల్లో దక్షిణాదిలో ముందున్న నటి రాధికా ఆప్టే. ఆ మధ్య ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్న సమయంలో ఒక నటుడు తనను పడక గదికి రమ్మని చిత్రహింసలకు గురి చేశాడని సంచలన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కిన రాధికా ఆప్టే ఇకపై తెలుగు చిత్రాల్లో నటించేది లేదని ప్రకటించారు. ఆ మధ్య కబాలి చిత్రంలో రజనీకాంత్ సరసన నటించినా ఈ అమ్మడికి పెద్దగా క్రేజ్ రాలేదు. ఈ ఉత్తరాది భామ 2015లో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన మెట్లీ అనే లఘు చిత్రంలో నగ్నంగా నటించి వివాదాలకు తావిచ్చారు. ఈ అమ్మడిని నెటిజన్లు ఏకి పారేశారు.
ఆ తరువాత 2016లో పార్‌చ్డ్ అనే చిత్రంలోనూ అదే విధంగా అర్ధ నగ్న దృశ్యాల్లో కనిపించి మరోసారి కలకలం సృష్టించారు. అయినా అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. ఇక దక్షిణాదిలో అయితే రాధికాఆప్టేను పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఆంగ్ల చిత్రాన్ని పూర్తి చేసి ఒక హిందీ చిత్రంలో నటిస్తోంది. కాగా, తన అర్ధనగ్న ఫొటోలను ఇంటర్నెట్‌లో ప్రచారం చేయడం గురించి ఇటీవల ఆమె ప్రస్తావిస్తూ ఆ సంఘటన తనను బాగా కలచివేసిందని పేర్కొంది. ఆ ఫొటోలు చాలా బాధించాయని, ఈ విషయాన్ని తొలుత తన తల్లి చెప్పిందని, ఆ తరువాత తన కారు డ్రైవర్ కూడా ఇదే మాట అన్నాడని రాధిక తెలిపారు. అయితే అందుకు తాను ఏం చేయను అని ఎదురు ప్రశ్న వేశారు. తన నగ్నదృశ్యాల ఫొటోలపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో రచ్చ రచ్చ చేశారని, ఇకపై తాను దాచడానికి ఏమీ లేదనీ పేర్కొన్నారు. తాను ఇక ఏమైనా చేయవచ్చునని, తన గురించి కొత్తగా ఎవరూ ప్రచారం చేసే అవకాశం ఉండదని అన్నారు. అయితే, ఏమీ లేనప్పుడు పాత విషయాలను కెలకడం ఎందుకు? మరచిపోయిన తన ఉనికిని చాటుకోవడానికా అంటున్నారు సినీ వర్గాలు.