సంచనల నటి రాధికా ఆప్టే తెరమీద బోల్డ్ గా కనిపించడానికి ఏమాత్రం మొహమాట పడదు. రొమాంటిక్ సీన్స్ అయినా నగ్నం గా తెరమీద కనబడాలన్న రాధికా తరవాతే అంటారు దర్శకులు. ఇప్పటికే బద్లాపూర్ , అహల్య సినిమాల కోసం ఈ బ్యూటీ నగ్నంగా కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి విషయాలపై రాధికా పై పలు విమర్శలు వచ్చాయి. దాంతో రాధికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం పై స్పందిస్తూ.. తెర మీద నగ్నంగా, శృంగార సన్నివేశాల్లో కనిపించడానికి నాకేం అభ్యంతరం లేదు. కథ డిమాండ్ చేస్తే నేను ఎప్పుడు సిద్ధమే. అయితే నన్ను చాలా మంది డైరెక్టర్లు అలాంటి పాత్రల కోసమే అడుగుతున్నారు. అంతమాత్రాన ఏది పడితే అది చేయను కథను బట్టి సినిమాలో నగ్నం గా నటిస్తా అని చెప్పుకొచ్చింది రాధికా.