యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- పూజాహెగ్గే హీరోహీరోయిన్‌లగు నటించిన తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఎక్కడా రాజీ లేకుండా నిర్మిస్తోంది. 1980లలో యూరప్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ లవ్ స్టోరి మెస్మరైజ్ చేయనుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ అంతకంతకు ఆలస్యమైంది.
తాజాగా ప్రభాస్ తన సోషల్ మీడియాలో ఈ చిత్రం రిలీజ్ డేట్‌తో పోస్టర్ ను పంచుకున్నారు. ఇందులో డార్లింగ్ యూరోప్ వీధుల్లో నడుస్తూ కనిపిస్తున్నారు. 2022 జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. ‘నా రొమాంటిక్ సాగా #రాధేశ్యామ్ కోసం మీరంతా కొత్త విడుదల తేదీ కోసం వేచి చూస్తున్నారు. మీరు వేచి ఉండలేరు – ఇది 14 జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది’. అని ప్రభాస్ వ్యాఖ్యను జోడించారు.
#Prabhas‘ #RadheShyam is all set to release in a theatre near you on Makar Sankranti, 14th January 2022! pic.twitter.com/ccVG0BQak1
— Prabhas (@PrabhasRaju) July 30, 2021