‘సాహో’ తర్వాత ప్రభాస్ నుండీ వచ్చిన ‘రాధే శ్యామ్’ దానికి మించి డిజాస్టర్ అయ్యే విధంగా దూసుకుపోతుంది. మార్చి 11న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.దర్శకుడు రాధా కృష్ణకుమార్ నేరేషన్ కూడా చాలా స్లోగా ఉందని ప్రేక్షకులు పెదవి విరిచారు. ‘గోపికృష్ణా మూవీస్’ సంస్థతో కలిసి ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. పూజా హెగ్డే గ్లామర్ కూడా ఈ చిత్రానికి ప్లస్ అయ్యింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతంలో రూపొందిన పాటలు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఇవన్నీ బాగున్నప్పటికీ టికెట్లు మాత్రం చిరగడం లేదు. ఈ చిత్రం 4 రోజుల కలెక్షన్లను చూస్తే :
నైజాం : 22.87 కోట్లు
సీడెడ్ : 6.92 కోట్లు
ఉత్తరాంధ్ర : 4.69 కోట్లు
ఈస్ట్ : 4.02 కోట్లు
వెస్ట్ : 3.11 కోట్లు
కృష్ణా : 2.43 కోట్లు
గుంటూరు : 4.19 కోట్లు
నెల్లూరు : 2 కోట్లు
——————————————————–
ఏపి+తెలంగాణ : 50.23 కోట్లు
కర్ణాటక : 4.10 కోట్లు
తమిళనాడు : 0.68 కోట్లు
హిందీ : 7.50 కోట్లు
కేరళ : 0.29 కోట్లు
ఓవర్సీస్ : 10.90 కోట్లు
రెస్ట్ : 4 కోట్లు
——————————————————–
వరల్డ్ వైడ్ టోటల్ : 77.7 కోట్లు(షేర్ (అన్ని వెర్షన్లు కలుపుకుని))
‘రాధే శ్యామ్’ చిత్రానికి రూ.196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు రూ.200 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.77.7 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.122.3 కోట్ల షేర్ ను రాబట్టాలి.వీకెండ్ తర్వాత ఈ మూవీ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. హిందీలో కూడా ఈ మూవీ పెద్దగా రాణించడం లేదు. కనీసం ఈ మూవీ రూ.100కోట్లు వసూల్ చేయడం కూడా కష్టంగా మారింది ఇప్పుడు.