హిందీ బిగ్‌బాస్ షో గతవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ -14లో రాధేమాగా ప్రసిద్ధి చెందిన సుఖ్వీందర్ కౌర్ కూడా సందడి చేసింది. దాంతో ఈసారి ఆమె కూడా షోలోపార్టిసిపేట్ చేయబోతుందని అనుకున్నారు. అది కేవలం ప్రచారం మాత్రమే. ఆమె కేవలం రెండు రోజులు మాత్రమే షోలో కనిపించింది. ఆమె కేవలం ఇంటి సభ్యులను ఆశీర్వదించడానికి వచ్చిందని తర్వాత తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె బిగ్‌బాస్ హౌస్‌లో కనిపించడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
సాధువులు, సన్యాసులకు సంబంధించిన అత్యున్నత విభాగం అఖిల్ భారతీయ అఖాడ పరిషద్(ఏబీఏపీ) రాధేమా కనిపించడాన్ని పూర్తిగా తప్పు పట్టింది. ఆమె సాధువు, సన్యాసి కాదు అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఏబీఏపీ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మాట్లాడుతూ.. ‘రాధే మాను సాధువులు, సన్యాసులతో కలపవద్దు. గాడ్ ఉమెన్ అని భావించే ఆమెకి మతం, గ్రంథాల గురించి ఏమీ తెలియదు. కేవలం కాసినోలో పాటలు పాడటం, డ్యాన్స్ చేయటంలో మాత్రమే ఆమెకి ప్రావీణ్యం ఉంది. అది ఆమెను సాధువుగా చేయలేదు’ అని తెలిపారు. ఇక బిగ్‌బాస్ షోలో పాల్గొనడం ఆమె వ్యక్తిగత అభిప్రాయం అన్నారు.