శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘రాధ’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మే 12న విడుదలవుతుంది. ఈ సందర్భంగా…
చిత్ర సమర్పకులు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ.. ”వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్న యువ కథానాయకుడు శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న అవుటండ్ అవుట్ ఎంటర్టైనర్ ‘రాధ’. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ పూర్తి కావడంతో సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవల్లో మే 12న విడుదల చేస్తున్నాం. రీసెంట్గా విడుదలై ఈ సినిమా పాటలు, థియేట్రికల్ ట్రైలర్స్‌కు ప్రేక్షకుల సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. డెబ్యూ డైరెక్టర్ చంద్రమోహన్ తొలి చిత్రమే అయినా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. రొమాన్స్, కామెడీ , ఏక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరించే చిత్రం రాధ శర్వానంద్ కెరీర్లో మరో హిట్ మూవీ అవుతుంది” అన్నారు.