అలనాటి అందాల నటి, డ్యాన్సింగ్ క్వీన్ రాధ కుమార్తె కార్తీక వివాహం జరిగింది. కేరళలో కార్తీక వివాహం రోహిత్ మీనన్ వివాహా వేడుక కన్నులవిందుగా జరిగింది. ఈ ఉదయం జరిగిన ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కొణిదెల, సుహాసిని, రాధిక, శరత్ కుమార్, రేవతి, మేనక తదితరులు హాజరయ్యారు.
కార్తీక వివాహం తిరువనంతపురంలోని కవడియార్ ఉదయ ప్యాలెస్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. కేరళ సంప్రదాయాల ప్రకారం కార్తీక-రోహిత్ మీనన్ ల వివాహం నిర్వహించారు. కార్తీక కూడా తల్లి రాధ బాటలోనే పలు సినిమాల్లో నటించారు. 2009లో నాగచైతన్య సరసన జోష్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత జీవాతో కలిసి రంగం సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమెకు మంచి పేరు తెచ్చింది. తెలుగులో ఎన్టీఆర్ తో దమ్ము, అల్లరి నరేశ్ తో కలిసి బ్రదర్ ఆఫ్ బొమ్మాళి వంటి చిత్రాల్లోనూ నటించిన కార్తీక 2015 తర్వాత మరే చిత్రంలోనూ నటించలేదు. ఆమె వ్యాపార రంగంలో ప్రవేశించినట్టు తెలుస్తోంది.