టాలీవుడ్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ . ఈ సినిమాలో బన్నీ అన్నగా నటించిన నటుడు శ్యామ్ ని చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. సినీ ఇండస్ట్రీలో ఈ అరెస్ట్ చర్చనీయాంశంగా మారింది. చెన్నైలోని కోడంబాక్కంలో శ్యామ్ పోకర్ క్లబ్ నడుపుతున్నట్లు అలాగే గ్యాంబ్లింగ్ కు పాల్పడుతున్నట్టు స్థానిక పోలీసులు గుర్తించారు. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా బెట్టింగులు నిర్వహిస్తుండటంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఇప్పటివరకు తెలుగులో శ్యామ్ కిక్, ఊసరవెల్లి, కత్తి, రేసుగుర్రం వంటి సినిమాలో నటించాడు. ఈయన తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాడు