HomeTelugu Trendingఆర్ధిక ఇబ్బందులపై స్పందించిన రాశి..

ఆర్ధిక ఇబ్బందులపై స్పందించిన రాశి..

6

అందాల రాశి కూడా ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఆ తరవాత వ్యాంప్ క్యారెక్టర్‌ల్లో కూడా నటించి మెప్పించింది. ఆ తరువాత కొంత కాలం గ్యాప్ తీసుకొని ఈ మధ్య తల్లి క్యారెక్టర్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే కొంతకాలంగా రాశి ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారని వార్తలు హాల్‌ చల్‌ చేస్తున్నాయి. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ఆమె ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వార్తలు వచ్చాయి.

తాజాగా రాశి ఈ వార్తలపై స్పందించింది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె సమాధానం చెప్పారు. తాను ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు పడటం లేదని, తాను కుటుంబంతో సంతోషంగా ఉన్నాను అని. సింపుల్ గా హ్యాపీగా తన జీవితం సాగుతుందని చెప్పుకొచ్చింది. సమస్యలు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిని దాటుకుంటూ ముందుకు సాగాలంటూ రాశి చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu