HomeTelugu Trendingసినిమా టికెట్లు అమ్మిన రాశీ ఖన్నా

సినిమా టికెట్లు అమ్మిన రాశీ ఖన్నా

3 18
హీరోయిన్‌ రాశీ ఖన్నా తన సినిమా టికెట్లు అమ్మారు. హైదరాబాద్‌లోని గోకుల్‌ థియేటర్‌లో ‘ప్రతి రోజూ పండగే’ టికెట్లను విక్రయించారు. ఈ సందర్భంగా టికెట్లు కొనుగోలు చేయడానికి ప్రేక్షకులు ఉత్సాహం చూపారు. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు టికెట్లు కొన్న వారు మీడియా ఎదుట అన్నారు. సాయిధరమ్‌ తేజ్‌, రాశీ ఖన్నా జంటగా నటించిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ఈ చిత్రం కోసం సాయిధరమ్‌ మరింత ఫిట్‌గా తయారయ్యారు. రెండు నెలలు కష్టపడి కండలు పెంచారు. ఆయన వ్యాయామశాలలో శ్రమిస్తుండగా తీసిన వీడియోను బుధవారం విడుదల చేశారు. ‘చిత్రలహరి’ తర్వాత కొత్త లుక్‌ కోసం రెండు నెలల సవాలు స్వీకరించారని తెలిపారు.

ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు. సత్యరాజ్‌, రావు రమేష్‌, నరేష్‌, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా డిసెంబరు 20న (శుక్రవారం) విడుదల కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu