దక్షిణాది సినీ పరిశ్రమపై హీరోయిన్ రాశీ ఖన్నా ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాది సినిమాలు రొటీన్ గా ఉంటాయని… హీరోయిన్ రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించి, కనుమరుగు అవుతుంటుందని ఆమె అన్నారు. హీరోయిన్ కు గుర్తింపు కలిగిన పాత్రలు ఉండవని చెప్పారు. బాలీవుడ్ లో తనకు మంచి పాత్రలు వస్తున్నాయని… ఇకపై తనలో కొత్త నటిని చూస్తారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై దక్షిణాది సినీ ప్రేక్షకులు మండిపడ్డారు.
ఈ వెబ్ మూవీ ప్రమోషన్లలో గతంలో కొంతమంది హీరోయిన్లు చేసినట్టుగానే రాశిఖన్నా కూడా సౌత్ పై షాకింగ్ కామెంట్స్ చేసిందంటూ వార్తలు వచ్చాయి. కెరీర్ స్టార్టింగ్ లో తనను సౌత్ లో గ్యాస్ ట్యాంకర్ అన్నారని, రొటీన్ అంటే తనకు నచ్చదని, కానీ దక్షిణాదిలో అడుగు పెట్టాక ఆ రొటీన్ కే అలవాటు పడిపోయానని, ఇక్కడ అందాన్ని మాత్రమే చూస్తారని, హీరోయిన్లలో ట్యాలెంట్ ను చూడడం సౌత్ ప్రేక్షకులు అలవాటు చేసుకోవాలని, అంతేకాకుండా హీరోహీరోయిన్లకు సౌత్ లో ప్రత్యేకంగా ట్యాగులు ఇస్తారని, అది తనకు నచ్చదని, ఇక నుంచి తనలో, తాను ఎన్నుకునే కథల్లో కొత్త రాశి ఖన్నాను చూస్తారంటూ రాశి ఖన్నా చెప్పినట్టు గత వారం నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై రాశి ఖన్నా స్పందిస్తూ సోషల్ మీడియాలో తాను అన్న మాటల గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.
‘సౌత్ సినిమాల గురించి చెడుగా మాట్లాడాను అంటూ నా గురించి కొన్ని కల్పిత, తప్పుడు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఎవరు చేస్తున్నారో వారిని దయచేసి ఆపమని నేను అభ్యర్థిస్తున్నాను. నేను చేసే ప్రతి భాష, చిత్రం పట్ల నాకు చాలా గౌరవం ఉంది’ అంటూ అవన్నీ రూమర్లేనని కొట్టి పారేసింది. పైగా తనకు అన్ని భాషలపై, అన్ని భాషలపై సినిమాలపై గౌరవం ఉందంటూ స్పష్టంగా చెప్పేసింది. మరి ఇప్పటికైనా రాశిఖన్నా సౌత్ పై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని మండిపడుతున్న సౌత్ ప్రేక్షకులు శాంతిస్తారేమో చూడాలి.
‘కేజీఎఫ్ చాప్టర్ 2’: అమ్మ పాట విడుదల
🙏🏻😊 pic.twitter.com/yQa1nOacEY
— Raashii Khanna (@RaashiiKhanna_) April 6, 2022