హీరోయిన్ రాశీ ఖన్నా .. ప్రస్తుతం సాయి తేజ్ హీరోగా వస్తోన్న ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో నటిస్తోంది. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. అది అలా ఉంటే రాశీ మహిళల పై జరుగుతున్న ఘటనలపై స్పందించింది. మహిళపై అత్యాచారానికి పాల్పడేవాళ్లకు సత్వరమే కఠిన శిక్ష విధించేలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీలో దిశ చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఏపీ శాసనసభ దిశ యాక్ట్ 2019కి ఆమోద ముద్ర వేసింది. కాగా ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు తన సపోర్ట్ ను ప్రకటించారు.
ఈ విషయంపై తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నా స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదని, ఈ చట్టం వల్ల తప్పు చేస్తే చనిపోతాం అనే భయం ఉంటుందని, దీంతో తప్పు చెయ్యాలనుకునే వారు భయపడతారని చెబుతోంది. అంతేకాదు ఈ చట్టాన్ని మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలని రాశీ ఖన్నా కామెంట్స్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్రాలు చాలా నేర్చుకోవాలి – హీరోయిన్ రాశి ఖన్నా#APDishaAct#DishaActByYsjagan pic.twitter.com/dX9wL9FWpa
— 2024YSRCP (@2024YSRCP) December 15, 2019