గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టాలీవుడ్‌లోని తారలు మొక్కలు నాటి ఒకరినొకరు ఛాలెంజ్ విసురుకుంటున్నారు. తాజాగా రష్మిక మందన మొక్కలు నాటి రాశీ ఖన్నాకు ఛాలెంజ్ విసిరింది. దానిని స్వీకరించిన రాశిఖన్నా తాను మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి, మీ స్నేహతులను, బంధువులను మొక్కలు నాటేలా ప్రయత్నించండి అని అంటోంది. తమన్నా, కాజల్, రకుల్ ను మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరింది.