ఏపీ మంత్రి రోజా భర్త, తమిళ సినీ దర్శకుడు ఆర్కే సెల్వమణి తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. సెల్వమణి ప్రస్తుతం ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెప్సి)కి అధ్యక్షుడుగా, తమిళనాడు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో షూటింగులు జరపడం వల్ల తమిళ ఇండస్ట్రీకి చెందిన వేలాది మంది సినీ కార్మికులు చాలా నష్టపోతున్నారని ఆర్ కే సెల్వమణి అంటున్నారు. తమిళ పరిశ్రమకు చెందిన పెద్ద హీరోలు తమిళనాడలో కాకుండా పక్క రాష్ట్రాల్లోని హైదరాబాద్, వైజాగ్ లలో షూటింగులు చేస్తున్నారని, .. దీని వల్ల తమిళ సినీ కార్మికులకు భారీగా నష్టం జరుగుతోందని అన్నారు. కథ డిమాండ్ మేరకు షూటింగులు ఎక్కడ జరుపుకున్నా అభ్యంతరం లేదన్నారు.
అయితే సెక్యూరిటీ రీజన్స్ ను భద్రతను సాకుగా చూపుతూ పొరుగు రాష్ట్రాల్లో షూటింగులు జరపడం సరికాదని చెప్పారు. దేశంలోనే అతి పెద్దది, ఆసియాలోనే రెండో అతిపెద్ద ఫ్లోర్ ను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు… చెన్నైలో షూటింగులకు అవసరమైన అన్ని వసతులు, సౌకర్యాలు, రక్షణ వ్యవస్థలు ఉన్నాయన్నరు సెల్వమణి. తమిళనాడులోనే షూటింగులు జరుపుకోవాలనే తమ రిక్వెస్ట్ పట్ల స్టార్ హీరో విజయ్, అజిత్సానుకూలంగా స్పందించారని సెల్వమణి అన్నారు.