HomeTelugu Trendingషార్ట్ ఫిలిం జర్నీలో10 వసంతాలు పూర్తి చేసుకున్న పీవీఆర్ రాజా

షార్ట్ ఫిలిం జర్నీలో10 వసంతాలు పూర్తి చేసుకున్న పీవీఆర్ రాజా

PVR Raja completed 10 years

లఘుచిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు.. పెనుమత్స వెంకట రామరాజు ( పీవీఆర్ రాజా). ఆయన స్వస్థలం విజయనగరం.. తల్లితండ్రులు సత్యవతి, చంద్రశేఖర్‌. బి.ఏ తెలుగు పూర్తి చేసారు. ఆయన 2012 నుండి ఇప్పటి వరకు తెలుగు , కన్నడ , హిందీ , తమిళ్, ఆంగ్ల  అన్ని  భాషల్లో  కలిపి సుమారు 250 కి పైగా లఘుచిత్రాలకి  సంగీత దర్శకుడిగా పని చేసారు.

PVR Raja2

2012 నుండి ఇప్పటికి వరకు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ.. షార్ట్ ఫిలిం జర్నీ లో 10 వసంతాలు పూర్తి చేసుకున్నారు. తెలుగు లఘుచిత్ర పరిశ్రమలో  PVR Raja చేసిన కృషికి గాను  ” షార్ట్ ఫిలిమ్స్ మాస్ట్రో ”,  ”లఘు చిత్రాల ఇళయరాజా ” గా పేరుపొందారు.  2011లో ప్రతి ఏటా భారత ప్రభుత్వం నిర్వహించే జాతీయ స్థాయి యువజనోత్స పోటీలలో ఉమ్మడి సమైక్య ఆంధ్ర ప్రదేశ్ తరుపున  ప్రధమ  స్థానం లో నిలిచి , గిటార్ విభాగంలో ఉదయపూర్ రాజస్థాన్ లో జరిగిన పోటీలకి జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారు .

PVR Raja7

2012 భారత ప్రభుత్వ జాతీయ యువజనోత్సవాలలో ఆంధ్ర ప్రదేశ్ తరపున గిటార్ విభాగంలో ఎంపిక అయ్యారు. 2005 విజయనగరం జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలలో తృతీయ స్థానం పొందారు. 2007 చెన్నై లో ఏ. ఆర్ . రెహమాన్ నిర్వహించిన హూ.. లలల్లా.. మ్యూజిక్ బ్యాండ్ హంట్ లో పాల్గొని  షాలోమ్ బ్యాండ్ తరుపున టాప్ 18 లో నిలిచాడు. 2011 లో ప్రకాశం జిల్లా యువజనోత్సవాలలో ప్రధమ స్థానం పొందారు. 2011 హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలలో సొంతంగా రాసి కంపోజ్ చేసుకున్న పాటకు లైట్ మ్యూజిక్ విభాగంలో రాష్ట్ర స్థాయి అవార్డు  పొందారు.

PVR Raja1

2013 హైదరాబాద్ టైమ్స్ ఫ్రెష్ పేస్ 2013 కంపిటిషన్స్ లో ఫైనల్స్ కి ఎంపిక అయ్యారు. తానా( తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా) ఇంటర్నేషనల్ తెలుగు షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2017 ( ఇట్లు మీ లైలా ) 2017  ఒక్క సంవత్సరంలో నే  తాను సంగీతం చేసిన లఘు చిత్రాలకి గాను వరుసగా 7  సార్లు  “ఉత్తమ సంగీత దర్శకుడిగా  అవార్డులు ” అందుకున్నారు .  2020 రాంగోపాల్ వర్మ నిర్వహించిన స్పార్క్  (Spart ott )షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో  తొమ్మిది వేల చిత్రాలలో PVR రాజా సంగీతం చేసిన 3 చిత్రాలు టాప్ 18  లో నిలిచాయి.  టాప్ 5 లో రెండు చిత్రాలు ఉత్తమ చిత్రాలుగా అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి .

PVR Raja4

2020 సైమా షార్ట్ ఫిలిం అవార్డ్స్(Siima short film awards) lo MR. ప్రొడక్షన్స్ ‘అంతరార్ధం’ చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడి ( BEST MUSIC DIRECTOR ) కేటగిరికి ఎంపిక అయ్యారు. డైరెక్టర్ పూరి జగన్నాధ్ సొంత నిర్మాణ సంస్థ ‘ వైష్ణో మీడియా’ నిర్మించిన ‘ ఆర్య 3’ లఘు చిత్రంతో  పీవీఆర్ రాజా సంగీతం దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

PVR Raja5

అన్నపూర్ణ స్టూడియోస్ వారి అన్నపూర్ణ కాలేజీ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా గ్రాండ్ ఫెస్టివల్ 2018 లో ఆహా ఓటీటీ కోసం ఎంపికయిన ‘ఆత్మ రామ ఆనంద రమణ’ చిత్రానికి  పీవీఆర్ రాజా బాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసాడు. నటి, రాజకీయ నాయకురాలు రోజా సెల్వమణి నిర్మించిన వన్ అవర్ షార్ట్ ఫిలిం కి బాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు.

PVR Raja6

సంగీత ప్రయాణంలో తన వందవ చిత్ర సంగీతాన్ని షార్ట్ ఫిలిమ్స్ లో మంచి గుర్తింపు పొందిన ‘ ఎం ఆర్ ప్రొడక్షన్స్’ నిర్మించిన ‘ఒక్క క్షణం’ షార్ట్ ఫిలిం కి అందించారు. పేపర్ బాయ్ చిత్ర దర్శకుడు వి. జయశంకర్ దర్శకత్వంలో ‘విటమిన్ షీ’ ఓటిటి చిత్రానికి సంగీత దర్శకత్వం చేసాడు. ప్రముఖ డాన్సర్ యశ్వంత్ మాస్టర్ తొలి వీడియో ఆల్బం ” దిల్ అంత అదిరే  ” కి పీవీఆర్ రాజా నే సంగీత దర్శకుడు.

PVR Raja3

ఎల్. బీ. శ్రీరామ్ స్వీయ నిర్మాణంలో పదికి పైగా లఘు చిత్రాలకి పీవీఆర్ రాజా సంగీతం చేసాడు. (రూట్స్ – మన మూలాలు, మా బుజ్జక్క గ్రేట్ , స్వచ్ఛ భారతీయ్యుడు, మై ప్రొఫెసర్ ) మిట్టి-బ్యాక్ టూ ది రూట్స్ చిత్రంతో హిందీ ప్రేక్షకులకి  కూడా దగ్గర అయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu