HomeTelugu Newsఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన పీవీపీ ట్వీట్

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన పీవీపీ ట్వీట్

16 4

వైసీపీ నాయకుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి ప్రసాద్ (పీవీపీ) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.. గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానిపై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎంపీ కేశినేని నానితో చాలా రోజులు ట్విట్టర్లో వార్ నడిచింది. విమర్శలు, ప్రతివిమర్శలతో మొదలై వ్యక్తిగత దూషణల వరకూ వెళ్లింది..
ఇదంతా ఓవైపు అయితే తాజాగా పీవీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆయన ఉద్దేశం ఏమిటి అనే దానిపై క్లారిటీ లేకపోయినా తెలుగు మహిళా సీఎంను చూడాలనుకుంటున్నట్టు ట్వీట్ చేసి ఏపీ రాజకీయాల్లో కాకరేపారు.

“బూజుపట్టిన సంప్రదాయాలకు తెరదించుతూ, మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్డర్లను తీసుకోరు అన్న ప్రభుత్వం వాదనని పక్కనపెట్టి, కొత్త శకానికి నాంది పలికిన సుప్రీమ్‌కోర్ట్. ఆనాడు, అన్న ఎన్టీఆర్‌ గారు, ఆడవారికి సమాన ఆస్తిహక్కులు కల్పించి మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియచేసారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు
కూడా, మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజా ప్రతినిధులలో సగం, ప్రభుత్వంలో సగం.” అంటూ ట్వీట్ చేశారు పీవీపీ. ఆయన ఉద్దేశం ఏంటి..? అసలు.. ఆయన సీఎంగా చూడాలనుకుంటున్న ఆ మహిళా నేత ఎవరు? అనే ఆసక్తికర చర్చ ఏపీ
రాజకీయ నేతల్లో సాగుతోంది. తన ట్వీట్‌ను కాసేపటికే డెలిట్ చేశారు పీవీపీ… సోషల్ మీడియాలో పీవీపీ చేసిన ట్వీట్‌ను అప్పటికే స్క్రీన్ షాట్ తీసి వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. మరోవైపు… ఆ మహిళా సీఎం ఎవరనే ఆలోచనలోనూ పడ్డారు ప్రజలు. వైఎస్ భారతి కావొచ్చా? వైఎస్ షర్మిల సీఎం అవుతారా? లేదా వైఎస్ విజయమ్మ సీఎం పీఠం తీసుకుంటారా? అని ఆలోచిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu