కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో ఐదుగురికి పద్మ అవార్డులు దక్కాయి. క్రీడల విభాగంలో పీవీ సింధుకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. వ్యవసాయం రంగంలో చిన్నతల వెంకటరెడ్డికి పద్మశ్రీ అవార్డు, విద్య, సాహిత్య రంగాలకు సంబంధించి విజయసారధి శ్రీభాష్యంకు పద్మశ్రీ అవార్డు లభించింది. కళలు విభాగంలో యడ్ల గోపాలరావు, దలవాయి చలపతిరావులకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. 71వ గణతంత్ర వేడుకల సందర్భంగా దివంగత బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలతో పాటు వివిధ రంగాల్లో సేవలందించిన వారికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది పద్మ విభూషణ్-7, పద్మభూషణ్-16, పద్మ శ్రీ- 118 ఇలా మొత్తంగా వివిధ రంగాలకు చెందిన 141 మంది పద్మ పురస్కారాలు దక్కించుకున్నారు. ఈ ఏడాది మొత్తం 21 మందిని ఈ పద్మ అవార్డులు వరించాయి.