పుష్ప సినిమా తెలుగులో తీశాడు సుకుమార్. ముందుగా పాన్ ఇండియన్ ఆలోచనలు లేవు. ఆ తరువాత మెల్లిమెల్లిగా ఇతర భాషల్లోకి రిలీజ్ చేస్తామని ప్లాన్ చేశారు. మధ్యలో హిందీలో రిలీజ్ చేయడం లేదని, అక్కడ బిజినెస్ జరగడం లేదని.. అందుకే నార్త్‌లో రిలీజ్ చేయరని రూమర్లు వచ్చాయి. తీరా చూస్తే సౌత్ కంటే నార్త్‌లోనే పుష్ప క్లిక్ అయింది. మెల్లిమెల్లిగా కలెక్షన్లు పుంజుకుని చివరకు వంద కోట్లు అక్కడే రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
దీంతో పుష్ప రేంజ్ మారిపోయింది. జాతీయ స్థాయిలో బన్నీ హవా పెరిగింది. సుకుమార్ తన మేకింగ్‌ను మరింతగా పదును పెట్టి.. పెట్టి.. సాన పెట్టి.. పెట్టి.. రెండో పార్ట్‌ను చెక్కుతూనే ఉన్నాడు. పుష్ప ది రైజ్ నుంచి పుష్ప ది రూల్‌ను తీసేందుకు ఇన్ని రోజులు పట్టింది. అసలు పుష్పలో కథ అంత లేకపోయినా.. హిట్టయింది కదా? అని దాన్ని సాగదీస్తూ సాగదీస్తూ రెండో పార్ట్‌ను తీస్తున్నారు. ఈ కథను కూడా సెట్స్ మీదు కూర్చునే సుకుమార్ అల్లేస్తున్నట్టుగా అప్పట్లో కథనాలు వచ్చాయి.
ఇక ఇప్పుడు మూడో పార్ట్ మీద రూమర్లు స్టార్ట్ అయ్యాయి. పుష్ప ది రైజ్.. పుష్ప ది రూల్.. పుష్ప ది రోర్ అంటూ ఇలా మూడు పార్టులుగా రాబోతోందనే రూమర్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రెండో పార్ట్ పరిస్థితే ఇంకా తేల్చలేదు.. అప్పుడే మూడో పార్ట్ మీద రూమర్లను ప్రారంభించేశారు. అసలు ఈ పుష్ప రెండో పార్ట్ రిజల్ట్ చూడకుండానే మూడో పార్ట్ గురించి ఎందుకు అని కొంత మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ టైపులో పుష్ప ఆర్ఆర్ఆర్ అయ్యేలా ఉంది.. రైజ్ రూల్ రోర్ అంటూ పుష్ప తన మేనియాను మూడు పార్టుల్లో చూపిస్తుందా? లేదా? అన్నది చూడాలి. అసలు సుకుమార్ మైండ్లో ఏముంది? ఇక ఈ పుష్ప సీక్వెల్స్‌తోనే కాలం గడిపేస్తాడా? అన్నది చూడాలి.