HomeTelugu Big Storiesఅసలు పుష్ప ఎక్కడ!

అసలు పుష్ప ఎక్కడ!

pushpa 2 update
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమాలో బన్నీ ప్యాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప: ద రైజ్’ దక్షిణాదితో పాటు హిందీలోనూ సూపర్ హిట్ అయింది. దాంతో, రెండో పార్టు ‘పుష్ప: ద రూల్’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టాకీ పార్టు చివరి దశకు వచ్చింది.
ఈ నేపథ్యంలో తాజాగా మూవీ యూనిట్‌ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ రోజు రష్మిక మందన్న పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిన్న వీడియో టీజర్ ను విడుదల చేసింది. అసలు పుష్ప ఎక్కడ? అంటూ 20 సెకండ్ల వీడియోతో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

‘తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. అసలు పుష్ప ఎక్కడ’ అంటూ న్యూస్ వచ్చినట్లు చూపించడం.. పుష్పకు మద్దతుగా పోలీస్ డౌన్ డౌన్ అంటూ అతని అభిమానులు గొడవ చేయడం కనిపించింది. పుష్ప ఎక్కడ? అనే శోధన త్వరలోనే ముగుస్తుంది.

రాజ్యం ఏలే ముందు సాగే వేట గురించి ఈ నెల 7న సాయంత్రం 4.05 గంటలకు తెలుస్తుంది అని ట్యాగ్ లైన్స్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ నెల 7న బన్నీ పుట్టిన రోజు కావడంతో చిత్రం టీజర్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. అంతకుముందు రష్మికకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆమె అందమైన ఫొటోను చిత్ర బృందం ట్విట్టర్ లో షేర్ చేసింది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu