HomeTelugu TrendingPushpa 2: నార్త్ లో పోటీ కి పుష్ప రాజ్ రెడీనా?

Pushpa 2: నార్త్ లో పోటీ కి పుష్ప రాజ్ రెడీనా?

Pushpa 2 to face so much competition
Pushpa 2 to face so much competition

Pushpa 2:

అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే, పుష్ప 2 స్వాతంత్ర్య దినోత్సవ రోజున విడుదలయ్యేది. ఎలాగో పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు లేవు కాబట్టి దేశవ్యాప్తంగా సంచలనంగా మారేది. మొదటి భాగం భారీ విజయాన్ని సాధించడంతో, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా పుష్ప: ది రూల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, చిత్ర బృందం సినిమాను డిసెంబర్ 6కి వాయిదా వేయడంతో అందరినీ నిరాశపరిచింది.

సినిమా విడుదలకి చాలా సమయం ఉన్నప్పటికీ, విడుదల తేదీపై ఇంకా సందేహాలు ఉన్నాయి. సినిమా డిసెంబర్ 6న విడుదలవుతుందా లేదా మళ్లీ వాయిదా పడుతుందా అనే అనుమానాలు ప్రేక్షకులలో వ్యక్తమవుతున్నాయి. షూటింగ్ పనులు త్వరగానే పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి.. సినిమా కూడా అనుకున్న తేదీకి రిలీజ్ అవ్వచ్చు.

కానీ ఆగస్టు నుండి బయటకి వచ్చేసిన పుష్ప 2 కి బాలీవుడ్ లో గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయ్యింది ఛవ్వా. విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా ఈ సినిమాలో నటిస్తున్నారు. తౌబా తౌబా పాటతోనే సోషల్ మీడియా లో కూడా స్టార్ అయిపోయిన విక్కీ కౌశల్ ఈ సినిమాలో హీరో మహారాజా శంబాజీగా కనిపించనున్నారు. ఇది ఒక పీరియడ్ డ్రామా.

దాంతో పాటుగా, మరో ప్రముఖ తమిళ సినిమా కూడా అదే తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఒకవేళ పుష్ప 2 వాయిదా పడితే వచ్చే ఏడాది వేసవికి పడాలి. లేకపోతే వరుసగా సినిమాలు పోటీలుగా వచ్చేస్తాయి. తెలుగులో అయితే అల్లు అర్జున్ సినిమా ఎప్పుడు విడుదల చేసిన ప్రాబ్లం ఉండదు. కావాలంటే అల్లు అర్జున్ సినిమా తెలుగు స్టార్లే పక్కకు తప్పుకుంటారు.

కానీ ఎంత పుష్ప 2 మీద భారీ అంచనాలు ఉన్నా కూడా వేరే భాషల్లో పోటీ లేకుండా అల్లు అర్జున్ కి సోలో రిలీజ్ అయితే దొరకదు. సినిమా కలెక్షన్ల మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎంతవరకు పోటీ ని దాటుకొని హిట్ అవుతుందో చూడాలి. ఎంత ఆయన అల్లు అర్జున్ సినిమా కాబట్టి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా.. కలెక్షన్లు భారీ స్థాయిలోనే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆసక్తికరంగా రెండు సినిమాల్లోనూ రష్మిక నే హీరోయిన్. కాబట్టి ఆమెకు ఆమెతోనే పోటీ ఉంటుందని అనుకోవచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu