HomeTelugu TrendingPushpa 2 Teaser: గంగమ్మగా అల్లు అర్జున్‌.. పూనకాలు తెప్పిస్తున్న టీజర్‌

Pushpa 2 Teaser: గంగమ్మగా అల్లు అర్జున్‌.. పూనకాలు తెప్పిస్తున్న టీజర్‌

Pushpa 2 Pushpa 2 Teaser,Gangamma jatara,allu arjun,mass jatara,Sukumar,Rashmika Mandanna

Pushpa 2 Teaser: ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినీ ప్రేక్ష‌కులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘పుష్ప‌: ది రూల్’ ఒకటి. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌- డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో హైప్స్‌ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఏప్రిల్ 8)న అల్లు అర్జున్ బర్త్‌డే సంద‌ర్భంగా ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్‌.

ఈ సినిమాలో గంగమ్మ జాతర హైలైట్‌గా నిలవనుంది. ‘పుష్ప: ది రైజ్’ మూవీ మొత్తం తిరుపతి యాసలో సాగింది. పార్టు-2లో అక్కడి ఆచారాలను కూడా ఈ సినిమాలో చూపించనున్నాడు. ఈ సినిమాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించిన గంగమ్మ జాతరలో అల్లు అర్జున్ గంగమ్మగా కనిపించిన వీడియో విడుదల చేశారు నిర్మాతలు. గంగమ్మ జాతరలో చీర కట్టుకొని, మెడలో నిమ్మకాయల దండ, పూల మాల, కాళ్లకి గజ్జెలు, కళ్లకి కాటుక, చెవిలీ వేసుకొని ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో త్రిశూలం పట్టుకొని పవర్‌ఫుల్‌గా ఎంట్రీ ఇచ్చాడు బన్నీ. ఇక రౌడీలను చితక్కొడుతూ చీర కొంగును దోపిన సీన్ అయితే అదిరిపోయింది.

ఒక నిమిషం 8 సెకన్లు ఉన్న టీజర్ చూస్తుంటే ఫ్యాన్స్‌కి బుర్ర పాడైపోయేలా ఉంది. అసలు ఈ లుక్‌లో అయితే బన్నీ విశ్వరూపమే చూపించాడు. టీజర్‌లోనే ఇలా ఉండే థియేటర్లో అసలు బొమ్మ పడితే ఎలా ఉంటుందో అంటూ బన్నీ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఒక్క టీజర్‌తో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు సుకుమార్.

తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మకు 8 రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఈ జాతర మేలో జరుగుతుంది. ఈ జాతర ప్రారంభం నుండి పూర్తి అయ్యే వరకూ ఊరి ప్రజలెవరూ పొలిమేరలు దాటరు. ఈ వేడుకల్లో భాగంగా.. మగవారు ఆడవారి వేషాలు వేస్తారు.

ఈ వేడుకల్లో చివరి రోజు అత్యంత ప్రధానమైంది. ఆరోజు పేరంటాలు వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగే జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. ఈ జాతర చిత్తూరు జిల్లాలో తిరుమల తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగి ఉంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu