![Pushpa 2 హిందీ హక్కులు ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయో తెలుసా? 1 Pushpa 2 Hindi Rights Sold for a Staggering Amount – Guess How Much?](https://www.klapboardpost.com/wp-content/uploads/2024/07/Will-Pushpa-2-be-delayed-beyond-December.jpg)
Pushpa 2 Hindi rights:
Pushpa 2 గురించి వస్తున్న పుకార్లకు సంబంధించి, సినిమా హక్కుల విషయమై తాజాగా ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ స్పందించాడు. OTT, శాటిలైట్ హక్కులు ఇంకా పూర్తిగా కుదరలేదు అని క్లారిటీ ఇచ్చారు. కొన్ని ఒప్పందాలు మాత్రమే కుదిరాయని, మరికొన్నింటిపై చర్చలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్ ఉత్తర భారతదేశంలో 150 కోట్లకు పైగా వసూలు చేయడంతో, ‘పుష్ప: ది రూల్’ హిందీ డబ్బింగ్ హక్కుల కోసం బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు రూ. 220 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
హిందీ ప్రేక్షకుల్లో అల్లు అర్జున్ పాపులారిటీ విపరీతంగా పెరగడంతో, ఈ సినిమా డిసెంబర్‌లో సంచలనాత్మక ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని అంచనా. ఈ భారీ క్రేజ్ కారణంగా హిందీ డబ్బింగ్ హక్కులకు భారీ మొత్తంలో డీల్ కుదిరింది.
ఇతర హక్కుల విషయానికి వస్తే, Pushpa 2 ఆడియో హక్కులు కూడా రికార్డు స్థాయిలో రూ. 40 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. ‘శ్రీవల్లి’, ‘సామి సామి’, ‘ఊ అంటావా’ వంటి పాటలు పెద్ద హిట్ కావడంతో, ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మరిన్ని సూపర్ హిట్లు అందిస్తారని అంచనా వేస్తున్నారు.
OTT, శాటిలైట్ హక్కుల విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. OTT సంస్థలు ముందుగా అడ్వాన్స్ చెల్లించి, సినిమా థియేటర్లలో వసూళ్లు ఆధారంగా ఫైనల్ రేట్లు కుదుర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ విధానం పెద్ద సినిమాలకు లాభదాయకమని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఈ కొత్త పద్ధతి పుష్ప 2 సినిమాకి కూడా బాగానే కలిసి వచ్చే అవకాశం ఉంది.