HomeTelugu Big StoriesPushpa 2 సినిమా కోసం నటీనటులు తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు!

Pushpa 2 సినిమా కోసం నటీనటులు తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు!

Pushpa 2 Cast Salaries: Who earned the most?
Pushpa 2 Cast Salaries: Who earned the most?

Pushpa 2 Cast Remunerations:

2024లో ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘పుష్ప 2: ది రూల్’ డిసెంబర్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అల్లు అర్జున్‌ ‘పుష్ప రాజ్’గా మరోసారి తెరపైకి రానున్నారు.

రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 5 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సీక్వెల్‌కు సంబంధించి నటీనటుల పారితోషికాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ హాట్ టాపిక్ గా మారాయి.

పుష్ప 2 నటుల రెమ్యునరేషన్ వివరాలు ఒకసారి చూద్దాం..

1. అల్లు అర్జున్:

New Project 12 1 1 Pushpa 2,Pushpa 2 cast

ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ పొందిన నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు. 300 కోట్ల రూపాయలు తీసుకున్న బన్నీ, పుష్ప రాజ్ పాత్రకు మరోసారి న్యాయం చేయబోతున్నారు.

2. రష్మిక మందన్న:
New Project 13 1 1 Pushpa 2,Pushpa 2 cast

శ్రీవల్లి గా రష్మిక మందన్న ఈ సారి 10 కోట్ల రూపాయలు ఛార్జ్ చేశారు. మొదటి భాగంలో రూ.2 కోట్లు పొందిన రష్మికకు ఈసారి భారీ పారితోషికం లభించడంతో ఆమె క్రేజ్ అర్థమవుతోంది.

3. ఫహద్ ఫాసిల్:
New Project 14 1 1 Pushpa 2,Pushpa 2 cast

ఐపీఎస్ భన్వర్ సింగ్ శేఖావత్‌గా ఫహద్ ఫాసిల్ తన అద్భుతమైన నటనను మరోసారి ప్రదర్శించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన 8 కోట్ల రూపాయలు అందుకున్నారు.

4. శ్రీలీల:
New Project 15 1 1 Pushpa 2,Pushpa 2 cast

‘కిస్సిక్’ అనే స్పెషల్ సాంగ్ లో అల్లు అర్జున్‌తో స్టెప్పులేసిన శ్రీలీల 2 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకుంది.

పుష్ప 2 మొదటి భాగం సృష్టించిన రికార్డులను తిరగరాయనుంది. 5 భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల రూపాయల గ్రాస్ సాధించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: Bigg Boss 8 Telugu లో ఈ వారం కూడా ఇద్దరు ఇంటి నుండి వెళ్ళిపోతారా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu