Puri Jagannath Next Movie:
ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో Puri Jagannath కూడా ఒకరిగా ఉండేవారు. కానీ ఇప్పుడు పూరి అసలు ఫామ్ లోనే లేరు అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఇడియట్, పోకిరి, వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ పూరి.. ఇప్పుడు ఒక మినిమం గ్యారంటీ సినిమా తీయడానికి కూడా కష్టాలు పడుతున్నారు.
లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ మీద చాలా మంది అభిమానులకి సైతం నమ్మకం పోయింది. ఆ సినిమాకి వచ్చినా నష్టాలను తీర్చాల్సింది అంటూ డిస్ట్రిబ్యూటర్లు గొడవలు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ మధ్య నేను విడుదలైన డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదల కి ముందు రోజు వరకు ఈ గొడవలు జరుగుతూనే వచ్చాయి. లైగర్ సినిమా వల్ల కలిగిన నష్టాల కు పరిహారంగా 40% ఇస్తామని పూరి జగన్నాథ్ మాట ఇచ్చాకే డిస్ట్రిబ్యూటర్ లు డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదల కి ఒప్పుకున్నారు.
కానీ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమా కూడా భారీ డిజాస్టర్ అయింది. దీంతో నిర్మాత నిరంజన్ రెడ్డి బోలెడు నష్టాల్లో కూరుకుపోయారు. హను మ్యాన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో వచ్చిన డబ్బులు మొత్తం పెట్టి అన్నీ ఏరియాల్లో డబుల్ ఇస్మార్ట్ రైట్స్ కొనుక్కున్నారు నిరంజన్ రెడ్డి. కానీ మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కారణంగా డబ్బులు మొత్తం పోయాయి.
అయితే తాజాగా ఇప్పుడు పూరి జగన్నాథ్ నిరంజన్ రెడ్డికి వచ్చిన అప్పులు తీరుస్తానని చెబుతున్నట్లు సమాచారం. డబుల్ ఇస్మార్ట్ సినిమా రైట్స్ ను 60 కోట్లకి కొనుగోలు చేస్తున్న సమయంలోనే నిరంజన్ రెడ్డి తనతో పూరి జగన్నాథ్ ఒక సినిమా చేయాలని కండిషన్ పెట్టారట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పూరి జగన్నాథ్ మళ్లీ నిరంజన్ రెడ్డి నిర్మాతగా ఒక సినిమా చేయాలి.
ఈ సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హను మ్యాన్ వంటి సూపర్ సక్సెస్ తర్వాత మిరాయి అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న తేజ ఫ్లాప్స్ లో ఉన్న పూరితో సినిమా చేస్తారా లేదా తెలియాలి. ఒకవేళ చేసిన ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది డౌటే. మరి పూరి జగన్నాథ్ హిట్ ఎప్పుడు కొడతారో.. నిరంజన్ రెడ్డి అప్పులు ఎప్పుడు తీరుస్తారో చూడాలి.